Eto Vellipoyindhi Manasu : భాదతో దూరంగా వెళ్తానన్న మాజీ ప్రేమికురాలు.. అత్త గురించి నిజం చెప్పేసిందిగా!
on Dec 18, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -282 లో..... రామలక్ష్మి దగ్గరికి సీతాకాంత్ వెనకాల నుండి వచ్చి ఆట పట్టిస్తాడు. దాంతో రామలక్ష్మి చిరాకు పడుతుంది. వెళ్లి చాప తెచ్చుకొని కింద పడుకుంటుంది. సీతాకాంత్ కూడా నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే అని అంటాడు. మళ్ళీ చిరాకు గా నందినికి మీకు మధ్య ఎం జరుగుతుందని అడుగుతుంది. చెప్పాను కదా మా మధ్య ఏం లేదని ఎందుకు ఇలా అపార్ధం చేసుకుంటున్నావని సీతాకాంత్ కోపంగా వెళ్లి బెడ్ పైన పడుకుంటాడు.
అదంతా విన్న శ్రీవల్లి వెళ్లి హ్యాపీగా శ్రీలత, సందీప్ లకి జరిగింది చెప్పగానే వాళ్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఒక దెబ్బకి మూడు పిట్టలు అన్నట్లు రామలక్ష్మి, సీతాకాంత్, నందినిల పని అవుట్ అని సందీప్ అంటాడు. మరొకవైపు తప్పు చేశాను.. శ్రీలతతో చేతులు కలపకుండా నాకు నేనే ప్రయత్నం చేస్తే సీతకి దగ్గర అయ్యేదాన్ని అని హారికకి నందిని చెప్తూ ఫీల్ అవుతుంది. అప్పుడే సీతాకాంత్ వచ్చి హారికని బయటకు వెళ్ళమని నందినితో మాట్లాడతాడు. ఒక ఫ్రెండ్ గా చాలా హెల్ప్ చేసావ్ ఇప్పుడు కూడా చేస్తావ్ అనుకుంటున్నాను.. నాకు రామలక్ష్మి అంటే చాలా ఇష్టం. ఒకరి వల్ల మా మధ్య ప్రాబ్లమ్ రావడానికి వీలు లేదని సీతకాంత్ అనగానే.. ఎవరు ఆ ఒక్కరని నందిని అడుగుతుంది. నువ్వే నీ వల్ల రామలక్ష్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుందని సీతాకాంత్ అంటాడు.
ఆ తర్వాత అర్ధం అయింది.. నీకు దూరంగా వెళ్ళాలి అంతే కదా వెళ్తానని నందిని బాధగా చెప్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ వెళ్ళాక హారిక వస్తుంది. నందిని బాధపడుతుంటే ఓదార్చాతుంది. ఆ తర్వాత ఇక ఇక్కడ మనకేం పని లేదు USA వెళదామని హారికతో నందిని అంటుంది. ఆ మాట విని ధన, సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే రామలక్ష్మి వస్తుంది. కోపంగా నందినిని చూస్తుంటే అంత తప్పు నేనేం చెయ్యలేదు సీతని ప్రేమించాను కానీ తను నన్ను ఫ్రెండ్ లాగే చూసాడు.. ఎందుకు అపార్ధం చేసుకుంటున్నవ్ ఇదంతా మీ అత్తయ్య కావాలనే చెప్పింది. ఇన్ని రోజులు లేనిది మీరు హ్యాపీగా ఉన్నప్పుడే ఎందుకు చెప్పింది. మిమ్మల్ని విడగొట్టడానికి అని నందిని అంటుంది. మా అత్తయ్య మరిపోయిందని రామలక్ష్మి అనగానే.. లేదు మారలేదు.. ఇదంతా మీ అత్తయ్య ప్లాన్ అని నందిని చెప్పగానే.. రామలక్ష్మి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.